ఫీలింగ్ మిస్ కాదు : తెలుగులోనూ ఈ-మెయిల్‌

e-mailఇప్పటి వరకు ఇంగ్లీష్ కే పరిమితమైన ఈ-మెయిల్‌ అడ్రస్‌.. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఈ-మెయిల్‌ అడ్ర్‌స్ లను అందుబాటులోకి వచ్చాయి.

భవిష్యత్లో యాప్‌లు, ఇతర సర్వీసుల్లోనూ ఈ భాషలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మాతృభాష అవరోధం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మైక్రోసాఫ్ట్‌ ఇండియా COO మిథుల్‌ పటేల్‌.

Posted in Uncategorized

Latest Updates