ఫుట్ పాత్ ఆక్రమణలన్నింటినీ తొలగిస్తాం: విశ్వజిత్

హైదరాబాద్ లో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి వారంలో ఒకరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 6వేల వరకు ఆక్రమణలను కూల్చివేశారు. శనివారం (జూలై-21) చాంద్రాయణ్ గుట్ట నుంచి ఓవైసీ దవాఖాన వరకు.. రేతిబౌలి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు, ఎర్రగడ్డ నుంచి కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ వరకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తం 21కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫుట్ పాత్ ఆక్రమణలను కూల్చివేస్తమన్నారు ఎన్ ఫోర్స్ మెంట్ కమిషనర్ విశ్వజిత్.ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన తర్వాత ఎవరైనా తిరిగి నిర్మిస్తే వారికి రూ.10వేల జరిమానాతో పాటు పలు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కూల్చివేతలో బాగంగా  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు  చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates