ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే ఊరుకోబోం:GHMC

ghmcహైదరాబాద్ లో మొదటిదశ ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు పూర్తయింది. పెట్టుకున్న టార్గెట్ ను అనుకున్న టైమ్ లోపల పూర్తి చేసింది బల్ధియా. మూడ్రోజుల్లో నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న దాదాపు 4వేల ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించింది. ఇక ప్రతివారంలో ఒక రోజు ఫుట్ పాత్ ఆక్రమణల డ్రైవ్ చేపడ్తామంటున్నారు నగర మేయర్. అంతేకాదు నాలాలా కబ్జాపై కూడా దృష్టి పెడుతామన్నారు.

ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు కోసం.. చేపట్టిన మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ ముగిసింది.  మొత్తం ఆరు టీమ్ లు.. 12 జేసీబీలు.. కావాల్సినంత సిబ్బందితో ఫుట్ పాత్ల పై ఉన్న ఆక్రమణలు తొలగించారు. స్థానికులు అడ్డుపడే ప్రయత్నం చేస్తే పోలీసుల సహకారం తీసుకొని పుట్ పాత్ ఆక్రమణలను కూల్చివేశారు.

ఫుట్ పాత్లను ఆక్రమించింది ప్రైవేట్ వ్యక్తులైనా, ప్రభుత్వ వ్యవస్థలైనా వెనక్కి తగ్గబోమన్నారు. మూడు రోజుల డ్రైవ్ లో నాలుగు వేల 131 ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు కమిషనర్ జనార్ధన్ రెడ్డి. ప్రతి వారంలో ఒక్క రోజు ఇదే విధంగా ఫుట్ పాత్ ల డ్రైవ్ ఉంటుందన్నారు. వెండర్స్ జోన్స్ ఏర్పాటు చేశాక స్ట్రీట్ వెండర్స్ ను కూడా తొలగిస్తామన్నారు కమిషనర్.

బల్ధియా ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ బలంగా లేకపోవడంతోనే ఇన్నాళ్లు అక్రమ కట్టడాలు, ఫుట్ పాత్ కబ్జాలు, నాలాల ఆక్రమణలు జరిగాయన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. త్వరలోనే నాలాల కబ్జా, ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి పెడ్తామన్నారు.

ఫుట్ పాత్ల పై అక్రమ కట్టడాలను తొలగిస్తామని వారం ముందుగానే బల్ధియా ప్రకటించింది. అయినా చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ నగరంలోని ఫుట్ పాత్ అక్రమాలను గుర్తించి డ్రైవ్ చేపట్టిన తర్వాత అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. మొదటి రోజే వెయ్యికి పైగా అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ఇక రెండో రోజు 13వందలకు పైగా నేలమట్టం చేశారు. మూడో రోజు ముందుగా గుర్తించిన  4వేల 131అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఆరు జోన్లలో ఆరు బృందాలు కలిసి కట్టుగా పనిచేయడంతోనే.. ఆక్రమణల కూల్చివేత ఈజీ అయిందన్నారు ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్.

మూడ్రోజుల పాటు జరిగిన ఆపరేషన్ ఫుట్ పాత్ డ్రైవ్ సక్సెస్ అయ్యింది. రెండో విడత కార్యక్రమాన్ని వచ్చేవారం మొదలు పెడ్తామంటున్నారు. అదేవిధంగా నాలాల కబ్జా తొలగింపులు, పాస్టిక్ రహిత నగరంగా మార్చడానికి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ పనిచేయడానికి సిద్దంగా ఉందని అంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates