ఫుట్ బాల్ అంటే పిచ్చి : కేరళ నుంచి రష్యాకి సైకిల్ పైనే వెళ్లాడు

MATCHపుట్ బాల్.. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న క్రేజే వారు. పుట్ బాల్ మ్యాచ్ కోసం పడిచచ్చేవాళ్లు  ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఎంతలా అంటే పుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్ లోకి రానివ్వకపోతే… స్టేడియం బయట ప్రొక్లేన్ సాయంతో మ్యాచ్ చూసేంత. అలాగే ఎలాగైనా రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2018 లో కేవలం ఒక్క పుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు కేరళకు చెందిన ఓ వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ రష్యాకు వెళ్లాడు.

కేరళలోని చేర్తలాకు చెందిన క్లిఫిన్ ఫ్రాన్సిస్(28) అనే యువకుడికి పుట్ బాల్ అంటే ప్రాణం. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2018 లో తన ఫేవరెట్ టీమ్ అర్జెంటీనా ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు ఫ్రిబ్రవరి-23 న తన జరనీ ప్రారంభించాడు. కొచ్చి నుంచి దుబాయ్ కి విమానంలో వెళ్లాడు. దుబాయ్ లో  ఓ సైకిల్ కొనుక్కుని దుబాయ్, ఇరాన్, అజీర్బైజాన్ దేశాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా 4 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి రష్యాకు చేరుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates