ఫుట్ బాల్ తీసుకొచ్చిన కళ : ఆ రెడ్ లైట్ ఏరియా.. ఫ్యామిలీలకు వీకెండ్ స్పాట్

footరెడ్ లైట్ ఏరియా.. ఈ పదాన్ని ఇంట్లో పలకటానికే వణికిపోతాం. మగాళ్లకు చెమటలు పడతాయి. ఎక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అపార్థం చేసుకుంటారో అని.. అసలు అలాంటి ఏరియా సిటీలో ఉందని.. నాకు తెలుసు అని ఇంట్లో మహిళలకు తెలియటానికి కూడా ఇష్టపడరు. ఇదంతా కామన్. కానీ ఇప్పుడు అలాంటి రెడ్ లైట్ ఏరియాకు ఫ్యామిలీలతో సహా వెళ్లిపోతున్నారు. వీకెండ్ వస్తే చాలు.. ఓ రెండు గంటలు ఆ వీధుల్లో పిల్లాపాపలతో తిరిగి వస్తున్నారు. ఇదంతా కోల్ కతాలోని సోనాగంజ్ రెడ్ లైట్ ఏరియా.. ఇప్పటికే అక్కడ వ్యభిచారం నడుస్తుంది. కాకపోతే వారు ఉంటున్న ఇల్లు, వీధులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. అంతా ఫుట్ బాల్ మయం. ఓ ఫుట్ బాల్ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు ఉంది సోనాగంజ్ ఏరియా.

మామూలుగా అయితే ఈ ప్రాంతంలోని రోడ్లపై పాన్ మరకలు, చెత్త, ప్లాస్టిక్ ఇలా ఉంటుంది. ఇల్లు అయితే దుమ్ముకొట్టుకుపోయి, రంగులు వెలిసిపోయి మరీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం అంతా ఫుట్ బాల్ కలర్స్. ప్రపంచంలోని పేరొందిన ఫుట్ బాల్ జట్ల రంగులు, ఆటగాళ్ల పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఆయా దేశాల ఫుట్ బాల్ జట్ల రంగులతో నిండిపోయాయి. రోడ్లపైనా ఫుట్ బాల్ కు సంబంధించిన గ్రౌండ్ బొమ్మలు దర్శనం ఇస్తున్నాయి. ఇళ్లకు అయితే వివిధ రకాల డిజైన్లు, రంగులతో తీర్చిదిద్దారు. ఆయా జట్ల కాగితాలతో బ్యానర్లు కట్టారు. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టినోళ్లకు ఏదో ఫుట్ బాల్ ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇళ్ల ముందు టాప్ ప్లేయర్స్ ఫొటోలతో అద్బుతంగా తీర్చిదిద్దారు. అక్కడి పిల్లలకు మరో ప్రపంచాన్ని అందించారు. పుట్ బాల్ మ్యాచ్ ని కన్ను ఆర్పకుండా ఎలా చూస్తారో.. ఇప్పుడు అందరూ కోలకత్తాలోని భారత్ లోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాని చూస్తున్నారు. చరిత్రలో మొదటిసారి కామంతో కాకుండా కళతో చూస్తున్నారు సోనాగంజ్ ఏరియాను. ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు అక్కడ డిజైన్ ను, ఆర్ట్ ని చూస్తున్నారు.

ఈ ఏరియాకు జీవితంలోనే అడుగుపెట్టకూడదనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు సోనాగంజ్ ఏరియాకు వచ్చి అక్కడ ఆర్ట్ ని, డిజైన్ ను చూసి నోరెళ్లబెడుతున్నారు. బ్రెజిల్ టీమ్ కలర్స్ తో, అర్జెంటీనా పుట్ బాల్ టీమ్ కలర్స్ తో సోనాగంజ్ గోడలకి పెయింట్లు వేశారు అక్కడి యువకులు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది వీకెండ్లో సోనాగంజ్ ఏరియాలో తిరిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పుట్ బాల్ గేమ్ ద్వారా సెక్స్ వర్కర్ల పిల్లలకు ఉన్నత జీవితం కోసం డర్బర్ పుట్ బాల్ అకాడమీ క్యాంపెయిన్ ను ప్రారంభినప్పటి నుంచి సెక్స్ వర్కర్లకు పుట్ బాల్ గేమ్ తో అనుబంధం బలపడింది. ఇదంతా చేసింది దశాబ్దాలపాటు కోలకతాను పాలించిన కామ్రేడ్స్ కాదు.. ప్రస్తుతం పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాదు.. సౌతాఫ్రికాలోని డర్బన్ సిటీలోని ఫుట్ బాల్ అకాడమీ.. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత సోనాగంజ్ కు.. ఓ విదేశీ ఫుట్ బాల్ అకాడమి కొత్త రూపు ఇచ్చింది.. ఇదే అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది..

Posted in Uncategorized

Latest Updates