ఫుట్ బాల్ విశ్వవిజేత ఫ్రాన్స్

2018 ఫిఫా వరల్డ్ కప్ ఫ్రాన్స్ వశమైంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించింది. మాస్కో లూజ్నికీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో…  4-2 గోల్స్ తేడాతో విక్టరీ కొట్టి విశ్వవిజేతగా నిలిచింది ఫ్రాన్స్. 66 శాతం క్రొయేషియా కంట్రోల్లేనే బాల్ ఉన్నా మ్యాచ్ ను కాపాడుకోలేకపోయింది. 529 పాస్ లు,  83 శాతం పాస్ అక్యూరసి… ఇలా అన్నింట్లో క్రొయేషియాదే ఆధిప్యం.. కానీ అదృష్టం కలిసిరాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన రెండు గోల్స్… క్రొయేషియా కొంప ముంచాయి. చేజేతులా మ్యాచ్ ను చేజార్చుకొని…  ట్రోపీ సాధించాలనే కలను.. కలగానే మిగిల్చుకుంది .

మ్యాచ్ ఆరంభం నుంచి రెండు టీంలు హోరాహోరీగా పోటీపడ్డాయి. 18 వ నిమిషంలో ఫ్రాన్స్ కి వచ్చిన ఫ్రీకిక్ లో.. క్రొయేషియా స్ట్రైకర్ మారియో సెల్ప్ గోల్ కొట్టడంతో… ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత 28 వ నిమిషం దగ్గర ఇవాన్ పెరిసిక్ అద్భతమైన గోల్ కొట్టడంతో… క్రొయేషియా ఖాతా తెరిచింది. 36 వ నిమిషంలో పెనాల్టీ కిక్ తో ఫ్రాన్స్ మరో గోల్ సాధించి…  ఫస్ట్ హాఫ్ లో 2-1 తేడాతో లీడ్ సాధించింది.

సెకండ్ హాఫ్ లో ఫ్రాన్స్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. 59 వ నిమిషంలో పాల్ పోగ్బా, 65 వ నిమిషంలో ఎంబాప్పే గోల్స్ సాధించి.. టీంకు అద్భుతమైన ఆధిక్యాన్ని అందించారు. 69 వ నిమిషంలో క్రొయేషియా ప్లేయర్ మారియో రెండో గోల్ కొట్టినా… అప్పటికే మ్యాచ్ వన్ సైడ్ అయ్యింది. దీంతో ఫ్రాన్స్ 4-2 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించి.. జగజ్జేతగా నిలిచింది.

ఫిఫా ఫైనల్ మ్యాచ్ ను గ్రౌండ్ కు వెళ్లి చూశారు.. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, క్రొయేషియా అధ్యక్షురాలు గ్రాబర్. విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ టీంను, రన్నరప్ టీం క్రొయేషియా ఆటగాళ్లను అభినందించారు. ఫిఫా కప్ ను ఫ్రాన్స్ కు టీమ్ కు అందజేయడంతో… ప్లేయర్లు ప్లేయర్లు సంబురాలు చేసుకున్నారు. ఈ టైమ్ లో స్టేడియంలో జోరు వర్షం పడింది.

1998 లో మొదటిసారి ఛాంపియన్ గా నిలిచిన ఫ్రెంచ్ టీం… 20 ఏళ్ల తర్వాత రెండోసారి సాకర్ కప్ ను తన ఖాతాలో వేసుకొంది.  ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ విజేతగా నిలువడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.  గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు జనం. ఫ్యారిస్ వీధుల్లోకి పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ తీశారు అభిమానులు. ఈఫిల్ టవర్ పై పటాకులు పేల్చారు. అటూ ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ముందు అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

ఫైనల్లో క్రొయేషియా ఓడినా కోట్లాది మంది హృదయాలను గెలిచింది. నిజానికి ఫైనల్ చేరే దశలో అర్జెంటీనాకు, సెమీస్ లో ఇంగ్లండ్ కు షాకిచ్చి సత్తా చాటింది క్రొయేషియా. రౌండ్ – 16 లో డెన్మార్క్ పై… క్వార్టర్స్ లో రష్యాపై పెనాల్టీ షూటౌట్ లో గెలిచింది క్రొయేషియా.

విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ … భారత కరెన్సీ  ప్రకారం 260 కోట్ల ఫ్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్ క్రొయేషియాకు 192 కోట్లు, థర్డ్ ప్లేస్ లో ఉన్న బెల్జియంకు 164 కోట్లు, లీగ్ దశలో ఎలిమినేట్ అయిన ప్రతీ జట్టుకి 55 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.

Posted in Uncategorized

Latest Updates