ఫుడ్ ప్రాసెసింగ్ సబ్ కమిటీకి ప్రభుత్వం ఉత్తర్వులు

tslogoరాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ విధానంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాట్లు చేస్తూ శనివారం (ఫిబ్రవరి-10)  ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కమిటీ అధ్యక్షునిగా  మంత్రి పోచారం, కమిటీ సభ్యులుగా ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావును నియమించింది. రాష్ట్రంలో  సాగు పరిస్థితులు మెరుగైన నేపథ్యంలో వ్యవసాయ పద్దతుల్లో రావాల్సిన మార్పులు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై సలహాలు, పలు రకాల పంటలు, మార్కెటింగ్ సదుపాయాలపై సూచనలు చేయనుంది కమిటీ.  మూడు నెలల్లోగా నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. మరోవైపు కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ గా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates