ఫుడ్ మిగిలితే ఇలా చేయండి : రోడ్లపై పబ్లిక్ ఫ్రిడ్జ్ లు

పేద ప్రజలు ఖాళీ కడుపుతో నిద్రపోకూడదని…. తమ వంతుసాయంగా కొన్ని కమ్యూనిటీలు ఏర్పాటు చేస్తున్న ది పబ్లిక్ ఫ్రిడ్జ్ లు బెంగళూరు సిటీలోని పేద ప్రజలకు వరంగా మారాయి. రెస్టారెంట్లు, ఇళ్లల్లోని మిగిలిన పుడ్ ను వేస్ట్ గా పడవేయకుండా… ఆ పుడ్ ను పేద ప్రజలకు అందించడమే ఈ పబ్లిక్ ఫ్రిడ్జ్ ల వెనక ఉన్న ఉద్దేశం. ఈ ఫ్రిడ్జ్ ల ద్వారా రోజుకి 400మంది పేదవాళ్ల కడుపు నిండుతుంది.

బీటీఎం లేఔట్, ఇందిరానగర్, కోరమంగళ, బెన్సన్ టౌన్, బ్రూక్ ఫీల్డ్స్ లోని ప్రదేశంలో ఆకలితో ఉన్న పేదవాళ్ల కడుపు నింపేందుకు ఈ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తమ ఇళ్లల్లో అదనంగా ఉన్న పుడ్ ను డస్ట్ బిన్ లో పడేయకుండా… నీట్ గా ఆ పుడ్ ని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం ద్వారా పేదవాళ్ల కడుపులు నిండుతాయని పబ్లిక్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ…. ఇస్సా ఫాతిమా జాస్మిన్ తెలిపింది. గతేడాది నవంబర్ లో బీటీఎం లేఔట్ లో ఈ ఫౌండేషన్ పబ్లిక్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ 100 మంది వరకూ ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నం దొరకుతుంది. సిటీలో రోజురోజుకి ఫుడ్ ని వేస్ట్ చేసేవాళ్లు అధికమవుతున్నారని, తమకు సరిపోగా మిగిలిన పుడ్ ను…. ఈ ఫ్రిడ్జ్ లలో ఉంచడం ద్వారా ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నిండుతుందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates