ఫుల్ డెవలప్ మెంట్ : ఒక గ్రామానికి ఇద్దరు MLAలు

సాధారణంగా  ఏ గ్రామానికైనా ఒక  MLAనే ఉంటాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజక వర్గంలోని ఓ గ్రామానికి మాత్రం.. ఇద్దరు  MLAలు ఉన్నారు. ఒకరు  నియోజకవర్గ MLA అయితే, మరొకరు గ్రామానికి  చెందిన వ్యక్తి.. పక్క నియోజకవర్గానికి MLAగా  ఉన్నారు. ఇద్దరూ గ్రామానికి నిధులు ఇస్తూ అభివృద్ధికి  తోడ్పడుతున్నారు.

ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని మాక్లూరు గ్రామం. ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఈ ఊరి రూపురేఖలు మారిపోయాయి. ఆర్మూర్ TRS MLA జీవన్ రెడ్డితో పాటు, నిజామాబాద్ MLA గణేష్ గుప్తా మాక్లూరు గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మాక్లూరు మండలంలో తనకు తక్కువ మెజార్టీ రావడంతో గ్రామ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దీనికితోడు ఎమ్మెల్యే గణేష్ గుప్తాకి మక్లూర్ సొంతూరు కావటంతో.. ఆయన కూడా తన వంతు నిధులు పారిస్తున్నారు.

మాక్లూరును దత్తత తీసుకున్న MLA జీవన్ రెడ్డితో పాటు.. గణేష్ గుప్తా కలిసి.. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేశారు. కోటి రూపాయలతో మాక్లూరు గ్రామంలో రోడ్డు, 35 లక్షలతో స్త్రీ, శిషు సంక్షేమ భవనం, 17 కోట్లతో పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. మాక్లూరు నుంచి ముల్లంగి – సింగంపల్లి గ్రామాలకు 3 కోట్లతో రోడ్లు వేయించారు. గ్రామంలో ముస్లింల కోసం 10 లక్షలతో కబరిస్తాన్ ప్రహారీ గోడ, 5 లక్షలతో ఈజ్ గాం ప్రహారీ గోడ కట్టించారు. కస్తూర్భా కాలేజీకి కోటి, నిర్మాణంలో ఉన్న ఫార్మసి కళాశాలకి 17 కోట్లు, వ్యవసాయ గిడ్డంగులకు 5 కోట్లు కేటాయించి పనులు వేగంగా చేయిస్తున్నారు ఇద్దరు MLA లు. తమ గ్రామానికి ఇద్దరు MLA లు ఉండడం అదృష్టమంటున్నారు స్థానికులు. ఇద్దరి కృషితో గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో తమ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates