ఫృథ్వీ-2 ప్రయోగం విజయవంతం

PRUTWIఅణు సామర్ధ్యం కలిగిన ఫృథ్వీ-2 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం (ఫిబ్రవరి-7) ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణి పరీక్షను ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న ఛాందీపూర్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రయోగం ఇవాళ ఉదయం 10.21 గంటలకు జరిగినట్టు ఆ వర్గాలు తెలిపారు.

ఫృథ్వీ క్షిపణులను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవెలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద DRDO తయారు చేసిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు .భారత్ చేపట్టిన సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్న ఐదు క్షిపణుల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి బాలిస్టిక్ క్షిపణి కూడా ఇదే. ఫృథ్వీ క్షిపణులకు అణ్వాయుధాలతోసహా, 500 కేజీల పేలుడు పదార్థాన్ని 150-250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలకు తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఫృథ్వీ శ్రేణికి చెందిన రెండు వెర్షన్‌లను ఇప్పటికే ఆర్మీ, వైమానిక దళంలో ప్రవేశపెట్టారు.

Posted in Uncategorized

Latest Updates