ఫెడరల్ ఫ్రంట్ టూర్ : ఒరిస్సాకి వెళ్లనున్న సీఎం కేసీఆర్

kcr-Naveen-Patnaikఫెడరల్ ఫ్రంట్ పర్యటనలో భాగంగా ఒరిస్సా వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మే మొదటి వారంలో ఈ పర్యటన ఉండబోతుంది. బిజూ జనతాదల్ పార్టీ అధినేత, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చించనున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందంటున్నారు కేసీఆర్.

పార్టీల్లోని ప్రాంతీయ పార్టీలను ఏకంగా చేసి.. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకి జరుగుతున్న సన్నాహాల్లో భాగంగా ఒరిస్సాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. మే మొదటి వారంలో భువనేశ్వర్ వెళ్లి.. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు.

Posted in Uncategorized

Latest Updates