ఫెడరల్ ఫ్రంట్ టూర్ : రేపు బెంగళూరుకి సీఎం కేసీఆర్

kcr
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 13వ తేదీ శుక్రవారం ఉదయం బెంగళూరు వెళుతున్నారు. మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అవుతారు. ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి దేవగౌడతో చర్చలు జరిపేందుకే బెంగుళూరు వెళ్తున్నారు సీఎం కేసీఆర్.

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. రాజకీయ సమీకరణలు కూడా శరవేగంగా మారబోతున్నాయి. అందులో భాగంగానే కేంద్రంలో రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావం అనివార్యమని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే కోల్ కతా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో చర్చలు జరిపారు కేసీఆర్. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తో కూడా చర్చలు జరిపారు. రాజకీయంగా కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది.

Posted in Uncategorized

Latest Updates