ఫెడరల్ ఫ్రంట్ : దేవేగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు

KCRతెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం (ఏప్రిల్-13) బెంగళూరుకు చేరుకున్నారు.  బెంగళూరులో మాజీ ప్రధాని, జనతాదళ్ (S), అధినేత దేవేగౌడ్ తో సమావేశం అయ్యారు కేసీఆర్. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవేగౌడతో చర్చిస్తున్నారు. సీఎంతో పాటు ఎంపీలు కేకే, వినోద్ కుమార్, సంతోష్ కుమార్,  మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు వెళ్లారు.

త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో దేవెగౌడతో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు  త్వరలో  పలు రాష్ట్రాల సీఎంలతో  సమావేశం  కానున్నారు కేసీఆర్.  దీనికి  సంబంధించి  పార్టీ  సీనియర్లు  ఇప్పటికే  ఏర్పాట్లు చేస్తున్నారు.  సిద్దాంత  వైరుద్యాలు  పక్కనపెట్టి..కలిసొచ్చే  అన్ని పార్టీలను  కలుపుకొని  పోవాలని ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్.


Posted in Uncategorized

Latest Updates