ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ : కేసీఆర్ తో జార్ఖండ్ మాజీ సీఎం భేటీ

KCR HEMANTHతెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్. బుధవారం (మార్చి-28) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోరెన్ జాతీయ రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే.. హేమంత్ సోరెన్ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ కు వచ్చిన సోరెన్.. అక్కడే భోజనం చేశారు. ఆ తర్వాత వీరు రాజకీయ అంశాలపై చర్చించారు. సోరెన్ పిల్లలకు బొమ్మలు ఇచ్చి ముద్దు చేశారు సీఎం కేసీఆర్..

Posted in Uncategorized

Latest Updates