ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యం : జేపీ

కరీంనగర్ : ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు కేంద్రం దగ్గర ఉండటంతో దేశం అభివృద్ది చెందడం లేదన్నారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకుండా ఏ కూటమి మనుగడ సాధించలేదన్నారు. విద్య, వైద్యం లాంటి అంశాల్లో రాష్ట్రాలకు అధికారాలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ ఫిలింభవన్ లో నిర్వహించిన రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి – రాజ్యాంగ అడ్డంకుల అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates