ఫేక్ అకౌంట్లు డిలీట్ : సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫాలోవర్స్ ఢమాల్

ఫేక్.. ఫేక్.. ఫేక్.. ఇటీవల సోషల్ మీడియాలో మార్మోగుతున్న మాటలు ఇవి. అది గూగుల్ కావొచ్చు.. ఫేస్ బుక్ కావొచ్చు.. ట్విట్టర్ కావొచ్చు.. ఏదైనా ఫేక్ అనే మాట బాగా వినబడుతోంది. ప్రపంచ దేశాలు అన్నీకూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై నిఘా పెట్టటం, ఆయా సంస్థలకు వార్నింగ్స్ ఇచ్చాయి. దీంతో ఆయా ఫ్లాట్స్ ఫాంలో ఉన్న అకౌంట్లు అసలు – నకిలీ గుర్తించే పనిలో పడ్డాయి. వైరల్ పేరుతో డమ్మీ అకౌంట్స్ క్రియేట్ చేసే వారిని డిలీట్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ అయితే నకిలీల ఏరివేతలో ముందున్నాయి. దీంతో ఫేస్ బుక్ లైక్స్, ట్విట్టర్ ఫాలోవర్స్ ఢమాల్ అని పడిపోతున్నారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా సెలబ్రిటీల ఫాలోవర్స్ సంఖ్య తగ్గిపోయింది. ఆ లిస్ట్ ఓసారి చూద్దాం..

సెలబ్రిటీ                    ఫాలోవర్స్                           డిలీట్ అయినవి

ప్రధాని మోడీ               43.1 మిలియన్స్             2లక్షల 72వేలు

సీఎం చంద్రబాబు           4 మిలియన్స్                 15వేలు

జగన్మోహన్ రెడ్డి            7 లక్షలు                         12వేలు

కేటీఆర్                     2.432 మిలియన్స్             2వేల 500

లోకేష్                      4.75 లక్షలు                       వెయ్యి అకౌంట్స్ డిలీట్

పవన్ కల్యాణ్              3.12 మిలియన్స్              2వేల 626

మహేష్ బాబు              6.67 మిలియన్స్                   45 వేలు

రాణా దగ్గుబాటి             5.46 మిలియన్స్                   30వేలు

రాజమౌళి                  4.05 మిలియన్స్                   33వేలు

నాగార్జున                   5.45 మిలియన్స్                   34వేలు

షారూఖ్ ఖాన్              35.7 మిలియన్స్                   3లక్షల 52వేలు

అమితాబ్ బచ్చన్          34.5 మిలియన్స్                   4లక్షల 16వేలు

సల్మాన్ ఖాన్              33.8 మిలియన్స్                   3లక్షల 29వేలు

విరాట్ కోహ్లీ                25.7 మిలియన్స్                   లక్షా 25వేలు

సచిన్ టెండూల్కర్         26.5 మిలియన్స్                   2లక్షల 31వేలు

వారం రోజుల్లోనే తగ్గిన ఫాలోవర్స్ సంఖ్య ఇది. నకిలీ అకౌంట్లపై మరింత దృష్టి పెట్టిన ట్విట్టర్.. భారీ సంఖ్యలో ఫాలోవర్స్ కు కోత పెడుతుంది. భారతదేశంలోనే కోట్ల సంఖ్యలో అకౌంట్లు డిలీట్ కానున్నాయి. మరికొన్ని రోజుల్లో సెలబ్రిటీల ఫాలోవర్స్ మరింత తగ్గే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates