ఫేక్ ఓటర్ల కలకలం : ఈసీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

mpమధ్యప్రదేశ్ లో ఫేక్ ఓటర్ల వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది ఆ రాష్ట్ర కాంగ్రెస్. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ నేతృత్వంలో నేతలు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర జనాభా 24 శాతం పెరిగితే ఓటర్ల సంఖ్య 40 శాతం పెరిగిందని అసలు ఇది ఎలా సాధ్యపడుతుందని కాంగ్రెస్ లీడర్ జ్యోతిరాధిత్యసింధియా అన్నారు. దాదాపు 60లక్షల ఫేక్ ఓటర్లు రిజిస్టర్ అయ్యారని… దీనంతటికి అధికార బీజేపీనే కారణమని ఆరోపించారు. ఇది అధికారుల తప్పిదం కాదని, అధికార దుర్వినియోగం అని ఆరోపించారు దీనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మధ్యప్రదేశ్ ఓటర్ల లిస్టులోని వ్యత్యాసాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ లో మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సలినా సింగ్ జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఓటర్ల లిస్టులో నుంచి 6లక్షల పేర్లను తొలగించారు. ఈ ఏడాదిలోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఫేక్ ఓటర్ల అంశం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Posted in Uncategorized

Latest Updates