ఫేక్ డాక్టర్ ట్రీట్ మెంట్: 40 మందికి ఎయిడ్స్ వచ్చింది

intramuscular-injection-thumb_20180254897ఓ  నకిలీ డాక్టర్ చేసిన నిర్వాకం కారణంగా 40 మంది జీవితాలు నాశనమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో లో జరిగిన ఈ ఘటనతో హాస్పిటల్స్ కు వెళ్లే పేషెంట్లు భయంతో వణికిపోతున్నారు. ఒకే సిరంజితో ఇంజక్షన్ చేసి తమ జీవితాల్ని నాశనం చేశారంటూ భాధితులు కుమిలిపోతున్నారు. తమలాగా మరొకరికి ఇలా జరగకుండా..అతడిని ఉరి తీయాలని పోలీసులను కోరుతున్నారు.

ఉన్నావోలోని బంగార్‌మౌ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు బంగార్‌మౌలోని, మరో మూడు ఇతర ప్రాంతాల్లో జనవరి 24, 25, 27న ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో 566 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా వారిలో 40 మందికి హెచ్‌ఐవీ ఉందని తేలింది. ఒకే ప్రాంతంలో ఇంత ఎక్కువ మంది హెచ్‌ఐవీ బారిన పడటంతో అనుమానం వచ్చిన ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ బంగార్‌మౌలోని ప్రేమ్‌గంజ్‌, చక్మీర్‌పూర్‌ ప్రాంతాల్లో పర్యటించి నివేదిక సిధ్ధం చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం… ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామంలో రాజేంద్ర కుమార్‌ అనే నకిలీ డాక్టర్‌ తక్కువ ఫీజుకే వైద్యం పేరుతో ప్రాక్టీస్‌ స్టార్ట్ చేశాడు. అతడి దగ్గరకు వచ్చే పేషెంట్లకు ఒకే సిరంజీతో ఇంజక్షన్‌ చేసేవాడు. దీని కారణంగానే వీరందరికీ హెచ్‌ఐవీ సోకినట్లు నివేదికలో తేలింది. దీంతో రాజేంద్రకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. బాధితులను ట్రీట్ మెంట్ కోసం కాన్పూర్‌కు తీసుకెళ్లారు.ఇంకా ఎవరైనా ఈ నకిలీ డాక్టర్ కారణంగా రోగాలకు గురైనవారున్నారా అని పోలీసులు విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates