ఫేక్ న్యూస్ చేసింది పరేషాన్ : చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. వాహనదారుల తిప్పలు

హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం హైదరాబాద్ లో వాహనదారులను తిప్పలు పెట్టింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు 50 శాతం మాఫీ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. ఆదివారం గోషా మహల్ స్టేడియానికి వచ్చి పెండింగ్ చలాన్లు మాఫీ చేయించుకోవాలని ప్రచారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో వాహనదారులు గోషామహల్ స్టేడియానికి తరలివచ్చారు. తీరా అక్కడికి వచ్చాక.. అలాంటి ఏర్పాట్లేమీ లేకపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు.

వారం, పదిరోజుల కిందట ఈ ఫేక్ న్యూస్ వాట్సాప్ లో బాగా వైరలయింది. అది వచ్చిన మరుసటి రోజే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఖండిస్తూ.. అలాంటి లోక్ అదాలత్ లేదని ప్రకటించారు. ఈ ఫేక్ న్యూస్ చూసినోళ్లు మాత్రం.. పోలీసులు రిలీజ్ చేసిన మేసేజ్ చూడలేకపోయారు. 50 శాతం రాయితీ నిజమని నమ్మారు. గోషామహల్ స్టేడియానికి వచ్చిన తర్వాతగానీ..వారికి అసలు విషయం తెలియలేదు.

Posted in Uncategorized

Latest Updates