ఫేస్ బుక్ ఒప్పుకుంది : 5లక్షల మంది ఇండియన్స్ డేటా లీక్

FB5.6 లక్షల మంది భారతీయుల ఫేస్‌బుక్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్ధకు షేర్ చేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. భారత ప్రభుత్వం ఇచ్చిన నోటీస్‌కు ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 8.7 కోట్ల మంది యూజర్ల ఫేస్‌బుక్‌ డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్‌ అనలిటికా వాడుకున్నట్లు ఫేస్‌బుక్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మైక్ ష్రోఫెర్ తెలిపారు.

గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ లిమిటెడ్‌కు చెందిన అలెగ్జాండర్ కోగన్ తయారు చేసిన యాప్ ద్వారా కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్ధ ఫేస్‌బుక్ డేటాను సంపాదించింది. ఇండియాలో ఈ యాప్‌ను 335 మంది మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అయితే ఇది వాళ్ల స్నేహితుల ద్వారా ఓ చెయిన్‌లా మారి 5 లక్షల 62 వేల 120 మందిపై ప్రభావం చూపింది. మరోవైపు తమవైపు నుంచి తప్పు జరిగినా తనకు మరో అవకాశం ఇవ్వాలని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ కోరారు.

Posted in Uncategorized

Latest Updates