ఫేస్ బుక్ డేటా లీక్ : అమెజాన్, యాపిల్ కు కూడా సమాచారం ఇచ్చాం

facebook ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో తమ ఖాతాదారుల సమాచారాన్నిపంచుకున్నామని.. వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని వెల్లడించింది ఫేస్‌బుక్‌. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్‌బుక్‌ ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు రావటంతో.. అమెరికన్‌ కాంగ్రెస్‌కు రిపోర్ట్ అందించింది ఫేస్ బుక్ యాజమాన్యం.  ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ 700 పేజీల నివేదికను అమెరికన్‌ ప్రతినిధుల సభకు చెందిన హౌస్‌ ఎనర్జీ అండ్‌ కామర్స్‌ కమిటీకి సమర్పించింది ఫేస్ బుక్ యాజమాన్యం.

యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, శాంసంగ్, అలీబాబా, క్వాల్‌కాం, పాన్‌టెక్‌ తో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా ఆ దేశ నిఘా విభాగం పేర్కొన్న నాలుగు చైనా కంపెనీలు హ్యువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్‌ కూడా ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఆయా కంపెనీ ఉత్పత్తులతో ఫేస్‌బుక్‌ యాప్‌ అనుంధానం కోసం వివరాలు అందచేశామని చెప్పింది ఫేస్ బుక్. మొత్తం 52 కంపెనీల్లో 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని కూడా చెప్పింది. జూలైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని షాకింగ్ డీల్స్ వెల్లడించింది ఫేస్‌బుక్‌.

Posted in Uncategorized

Latest Updates