ఫేస్ బుక్ ఢమాల్ : గంటల్లోనే 9లక్షల కోట్లు నష్టం

ఫేస్ బుక్ షేర్లు గురువారం (జూలై-26) ఒక్కసారిగా ఢమాల్ అయ్యాయి. గంటల వ్యవధిలోనే 21శాతం నష్టపోయింది ఫేస్ బుక్. 130 బిలియన్‌ డాలర్లు ఆవిరైపోయాయి.  అంటే రెండు గంటల్లోనే 9లక్షల కోట్లు నష్టపోయింది. దీంతో ఫేస్ బుక్ CEO మార్క్ జుకెర్ బర్గ్ సంపద 16.8బిలియన్‌ డాలర్లు (ఇంచుమించు లక్ష కోట్లు) తరిగిపోయింది.

జుకెర్ బర్గ్ సంపదలో ఇంచుమించు ఐదోవంతు కోల్పోవడం ఇదే ఫస్ట్ టైమ్ గా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.  ఫేస్‌ బుక్ షేర్లు ఇలాగే గురువారం (జూలై-26)కూడా పతనమైతే బ్లూమ్‌ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ లో  జుకెర్‌ బర్గ్ మూడు నుంచి ఆరోస్థానానికి పడిపోతారని వెల్లడించింది బ్లూమ్‌ బర్గ్ రిపోర్ట్.

అదే జరిగితే జుకెర్‌ బర్గ్ సంపద 7 వేల కోట్ల డాలర్ల కంటే తక్కువకు చేరుతుందని ఆ రిపోర్ట్ స్పష్టంచేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌ బుక్ లాభాలు ఏడాదిలో 47 శాతం నుంచి 44 శాతానికి పడిపోయాయి. గత మూడేళ్లలో ఫేస్‌ బుక్‌ కు ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫేస్‌ బుక్ లాభం 510 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే షేరుకు 1.74 డాలర్ల మేర లాభాలు సాధించింది. రోజువారీ ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 147 కోట్లుగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates