ఫేస్ బుక్ ను డిలీట్ చేశా: ఫరాన్ అక్తర్

aktar
సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ డేటా లీక్ దుమారం బాలీవుడ్‌ను తాకింది. ఫేస్ బుక్ పై బాలీవుడ్‌ నటుడు ఫరాన్‌ అక్తర్‌  సంచలనం నిర్ణయం తీసుకున్నాడు.  FB  ఖాతాను డిలీట్‌ చేస్తున్నట్లు  మంగళవారం(మార్చి-27) సోషల్‌ మీడియా లో తెలిపాడు.ఇందులో భాగంగా ట్విటర్‌  పోస్ట్‌ పెట్టారు.  తన ఫేస్‌బుక్‌ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే  ఇప్పటికీ తన  అకౌంట్‌ పేజ్‌ ఇంకా వర్కింగ్ లోనే ఉందంటూ ట్వీట్‌ చేశారు.  ఎందుకు  తన ఖాతాను  తొలగించిందీ స్పష్టం చేయలేదు.

మరోవైపు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ, ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌కు గుడ్‌ బై చెప్పారు. తాజా వివాదం క్రమంలో ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ లో  స్పందించారు.  సింగర్, నటి చెర్‌తోపాటు మరికొందరు కూడా ఇదే బాటలో నిలిచారు.

2016  అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 50 మిలియన్ల ఫేస్‌బుక్ వినియోగదారులు  డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికా దక్కించుకుందున్నవార్త గ్లోబల్‌గా కలకలం రేపింది. దీనిపై అమెరికా ఫెడరల్‌   యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణను మొదలుపెట్టింది.

Posted in Uncategorized

Latest Updates