ఫేస్ బుక్ పరిచయం…ఆపై అత్యాచార యత్నం : ముగ్గురు అరెస్ట్

 ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లాడ్జిలో యువతిపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులైన మణికంఠ, ధీరజ్, భాషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి కంప్లెయింట్ మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

మైలవరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన మణికంఠతో కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ నెల 11న ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి కేవీఆర్‌ గ్రాండ్‌ హోటల్‌ లో రూమ్‌ ను బుక్‌ చేసుకుని మణికంఠ కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌ కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌ లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది.

Posted in Uncategorized

Latest Updates