ఫేస్ బుక్ ప్రేమకోసం.. కన్నతల్లిని చంపిన కూతురు

 ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుని కోసం కన్న తల్లినే చంపేసింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరువళ్ళూరులోని ఆంజనేయ పురంలో దేవీప్రియ తన తల్లి భానుమతితో కలిసి నివసిస్తుంది. 19 సంవత్సరాల దేవీప్రియ స్థానిక అవడి అనే కాలేజీలో బీకాం రెండవ సంవత్సరం చదువుతుంది. ఫేస్ బుక్ లో ఎస్. సురేశ్(19) అనే అతను దేవీకి  పరిచయమయ్యాడు. వీరు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నారు.  తంజావూరు లోని కుంభకోణంలో సురేశ్ నివసిస్తున్నాడు.

దేవీప్రియ తన తల్లి భానుమతికి ప్రియుడి గురించి చెప్పింది. తాము ఒకరినొకరు చూసుకోకుండా ఫేస్ బుక్ మాధ్యమంగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది. దీంతో కోపానికి వచ్చిన భానుమతి.. ముందుగా చదువుపై శ్రద్ధ వహించమని… ఫేస్ బుక్ ప్రేమలను నమ్మవద్దని చెప్పింది. కూతురి స్మార్ట్ ఫోన్ పై కూడా భానుమతి ఆంక్షలు విధించింది. దీంతో తల్లిని చంపడానికి దేవీప్రియ నిర్ణయం తీసుకుంది. అందుకు తన ప్రియుడైన సురేశ్ సాయం కోరింది. అందుకు అంగీకరించిన సురేశ్ సోమవారం ఇద్దరు మైనర్ లను దేవీప్రియ ఇంటికి పంపాడు.

సురేశ్ పంపిన ఆ ఇద్దరికి దేవీప్రియ తన తల్లిని చూపించింది. దీంతో ముగ్గురు కలిసి తల్లి భానుమతిని కొడవళ్ళతో హత్య చేశారు. దాడి చేస్తున్నప్పుడు భానుమతి పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వారిని పోలీసులకు పట్టించారు.  పోలీసుల విచారణ లో దేవీప్రియ అసలు విషయం చెప్పగా.. సురేష్ ను కూడా అరెస్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates