ఫేస్ బుక్ ప్రేమ : కోరిక తీర్చలేదని చంపేశాడు

fbఫేస్ బుక్ పరిచయాలతో ప్రాణాలు కోల్పోతున్న యువత రోజురోజుకి పెరిగిపోతున్నారు. తెలియని వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని యువతను హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా కొందరు అమ్మాయిలు ఈ ఫేస్ బుక్ పరిచయాలతో ప్రణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు మహారాస్ట్రలో కలకలం రేపుతుంది. మహారాష్ట్రలోని పాలగఢ్‌లో  జరిన ఓ నేరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హరిదాస్‌ యెర్‌గోడ్‌ (21)  అనే యువకుడికి ఫేస్‌బుక్‌ ద్వారా వాషి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. గత సంవత్సరకాలంగా  వీరిద్దరి మధ్య ఆన్‌లైన్‌లో సాన్నిహిత్యం పెరిగింది. అర్ధరాత్రి వరకు పోన్‌లో మాట్లాడుకునే వారు. హత్య కు ముందు ఒకసారి మాత్రమే వీరిద్దరూ కలుసుకున్నారు. హత్య జరిగే రోజున నిందితుడు హరిదాస్‌ తన గ్రామం నలసోపరకు  రావాలని ఆ అమ్మాయిని కోరాడు. ఉదయం పదిగంటల ప్రాంతంలో అతడి గ్రామానికి చేరుకుంది ఆ అమ్మాయి. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తన కోరికను తీర్చాలని హరిదాస్‌ ఆ అమ్మాయిని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి నిరాకరించడంతో కొద్ది సేపు ఒత్తిడి చేసిన అతడు తన షూలేస్‌ను అమ్మాయి మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపి మెట్లపై పడేశాడు. ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates