ఫేస్ బుక్ లో డేంజర్ బగ్… పోస్ట్ చేయకుండానే ఫొటోలను బయటపెట్టేస్తోంది

సోషల్ మెసేజింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ యాప్ లో డేంజర్ బగ్ ఉన్నట్లు గుర్తించామని ఫేస్ బుక్ ఇంజినీరింగ్ డైరెక్టర్ టోమర్ బార్ తెలిపారు. ఈ డేంజర్ బగ్ తో యూజర్ల పర్మిషన్ లేకుండానే ఫోన్ లో ఉన్న ఫొటోలు యూజర్ల అకౌంట్ లో అప్ లోడ్ అయ్యాయని  ఆయన చెప్పారు. ఈ బగ్ కారణంగా ఇప్పటికే సుమారు 68 లక్షల మంది ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీకి నష్టం కలిగిందన్నారు.

ఫేస్‌బుక్ యూజర్లు వేరే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు ఫేస్‌బుక్ డీటెయిల్స్ తో లాగిన్ అవుతుంటారు. ఆ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్‌… ఫోన్ లోని ఫొటోలను యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ అడుగుతాయి. అలా పర్మిషన్ ఇవ్వడమే యూజర్లు చేసిన మిస్టేక్ అయిపోయింది. అలా పర్మిషన్ ఇచ్చిన 6.8 మిలియన్ల మంది అంటే… 68 లక్షల మందికి చెందిన ప్రైవేట్ ఫొటోలు వారి పర్మిషన్ లేకుండానే ఫేస్ బుక్ అకౌంట్లలో అప్ లోడ్ అయ్యాయి. దీనికి సాఫ్ట్ వేర్ లోని ఓ బగ్ కారణమని ఫేస్ బుక్ తెలిపింది. ‘గుర్తించిన వెంటనే దీనిని తొలగించాం. జరిగిన తప్పుకు క్షమించండి’ అని టోమర్ అన్నారు. ఈ బగ్ తో 1500 యాప్స్ కి కూడా నష్టం కలిగిందని ఫేస్ బుక్ చెప్పింది. డెవలపర్స్ తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సంస్థ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates