ఫేస్ బుక్ లో సెల్ఫీ ఫోటో : ఆగిపోయిన యువతి పెళ్లి

MARRIAGE STOPఓ అమ్మాయి ఫోటోను మార్ఫింగ్ చేసి, ఫేస్ బుక్ లో పెట్టాడంతో యువతి పెళ్లి ఆగిపోయిన సంఘటన వరంగల్ లో జరిగింది. కొన్ని గంటల్లో వివాహం చేసుకోబోయే యువతికి ఈ చేదువార్త తన జీవితానికే ప్రశ్నార్థకంగా మారింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

అదే కంపెనీలో హైదరాబాద్‌ కు చెందిన ప్రశాంత్‌ పని చేస్తున్నాడు. యువతి ఫొటోలు సేకరించి, తామిద్దరూ కలిసి దిగినట్లుగా సెల్ఫీగా  మార్చాడు.  వాటిని ఫేస్‌ బుక్‌ లో ఆదివారం (జూలై-1) ఉదయం పోస్ట్‌ చేశాడు. ఆమెకు మంచిర్యాల జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌ తో ఆదివారమే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఫేస్‌ బుక్‌ లో ఆమె ఫొటోలను చూసిన వరుడు పెళ్లికి నిరాకరించాడు.  అయితే.. వరుడు అనిల్‌ కుమార్‌ ఫోన్‌ కు వధువుతో ఉన్న ఫొటోలు పంపిన ప్రశాతం.. వరుడికి ఫోన్‌ చేసి.. వధువు, తాను ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో.. వరుడు పెళ్లికి నిరాకరించాడు. తనను మోసం చేశారంటూ.. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు వధువు కూడా ప్రశాంత్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడో తీసుకున్న సెల్ఫీని చూపి తన పెళ్లి ఆగిపోయేందుకు కారణమైన ప్రశాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates