ఫైనల్ కి ఫ్రాన్స్ : ఫస్ట్ సెమీస్ లో..బెల్జియంపై విక్టరీ

ఫిఫా వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ లో బెల్జియంపై ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. సంచలనమైన విక్టరీలతో సెమీస్ కి దూసుకొచ్చిన ఫ్రాన్స్.. బెల్జియంపై కీలకమైన మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి చేరింది.  మంగళవారం (జూలై-10) సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు సామ్యూయెల్ ఉమ్తితి 51 నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 1998 ప్రపంచకప్ సొంతం చేసుకున్న ఫ్రాన్స్… ప్రస్తుతం సెన్సేషన్ గా మారిన  బెల్జియం మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

బెల్జియంకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు ఫ్రాన్స్ ఆటగాళ్లు. దీంతో బెల్జియం ఫైనల్స్ ఆశలు ఆవిరయ్యాయి.  ఇంగ్లాండ్‌, క్రొయేషియా తలపడే సెమీస్‌ లో గెలిచిన జట్టుతో ఆదివారం (జూలై-15) మాస్కోలోని లుహినికి స్టేడియంలో  ఫైనల్‌ ఆడనుంది ఫ్రాన్స్‌.

Posted in Uncategorized

Latest Updates