ఫైనల్ మనదే.. చిన్నారికి హర్భజన్ ఓదార్పు

ఇండియా,అఫ్గానిస్తాన్‌ మధ్య నిన్న(మంగళవారం) జరిగిన మ్యాచ్ టై అయిన సంగతి తెలిసిందే. చిన్న టీం అని లైట్ తీసుకున్న టీమిండియాకు ఆఫ్గాన్ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. అయితే మ్యాచ్ అనంతరం  ఓ భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ టై అవ్వడంతో ఒక పిల్లాడు బోరున ఏడ్చాడు. దీంతో  ఆ  పిల్లాడిని తండ్రి ఓదార్చాడు. ఈ  సన్నివేశాన్ని కొంతమంది వీడియో  తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. బాలుడిని ఓదారుస్తూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ఇదే విషయమై టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ‘’ చిన్నోడా ఏడవొద్దురా… ఫైనల్ మనమే గెలుస్తామని ‘’ ట్వీట్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates