ఫైనల్ లో.. భారత్ తో ఢీ : పాక్ ను చిత్తు చేసిన బంగ్లా

అబుదాబి : ఆసియాకప్‌ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. అబుదాబి వేదికగా నిన్న (సెప్టెంబర్-26)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 37 రన్స్ తేడాతో గ్రేట్ విక్టరీ సాధించింది బంగ్లాదేశ్. సంచలన విజయంతో బంగ్లాదేశ్ టీమ్ ఫైనల్ కి చేరింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన బంగ్లాదేశ్‌ 48.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (116 బంతుల్లో 99; 9 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, మొహమ్మద్‌ మిథున్‌ (84 బంతుల్లో 60; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 144 రన్స్ చేశారు.  పాక్‌ బౌలర్లలో జునైద్‌ ఖాన్‌  19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం.

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 202 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. ప్రారంభంలోనే.. నాలుగు బాల్స్ తేడాలో ఫక్హర్ (1), బాబర్ (1) ఔట్‌ కాగా, నాలుగో ఓవర్‌ లో కెప్టెన్ సర్ఫరాజ్ (10) వికెట్ పడటంతో.. పాక్ 18 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పాక్‌ కు ఇమామ్, షోయబ్ మాలిక్ (51 బంతుల్లో 30; 2 ఫోర్లు)  అండగా నిలిచారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించడంతో.. ఇన్నింగ్స్ కాస్త తేరుకున్నా.. షాదాబ్ (4) ఔట్‌ తో 94 రన్స్ కే సగం టీమ్ ఖాళీ అయ్యింది. ఈ దశలో ఆసిఫ్ అలీ (31) అద్భుత ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్నాడు. ప్రతి బాల్ ని ఆచితూచి ఆడుతూనే.. ఆరో వికెట్‌ కు కీలకమైన 71 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ..విజయానికి చేరువగా తెచ్చాడు. అయితే.. 8 బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌ కావడంతో బంగ్లా విజయానికి అండ్డకుండుల తొలిగిపోయాయి.  పాక్ ప్లేయర్లలో.. ఇమామ్(83)తోపాటు షోయబ్ మాలిక్(30), అసిఫ్ అలి(31) పోరాడినా ..ఫలితంలేకపోయింది. బంగ్లా బౌలర్.. ముస్తఫిజుర్‌ రహమాన్‌ (4/43) పాక్‌ ను దెబ్బ తీశాడు.

రేపు జరిగే ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ తో ఢీకొట్టనుంది బంగ్లాదేశ్.

 

Posted in Uncategorized

Latest Updates