ఫోటోగ్రాఫర్ గా మారిన మోడీ

చాలా రోజుల తర్వాత ఫోటోగ్రాఫర్ గా మారిపోయారు ప్రధాని మోడీ. సిక్కిం అందాలకు మంత్రముగ్ధుడైన మోడీ… అందమైన పర్వత శ్రేణులను, ప్రకృతి అందాలను తన సెల్ ఫోన్ లో బంధించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆ ఫోటోలను పంచుకున్నారు. ఇన్‌ క్రెడిబుల్‌ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌ ను జత చేస్తూ ట్విట్టర్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు.

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో మొదటి ఎయిర్ పోర్ట్ ని ఇవాళ మోడీ ప్రారంభించారు. రాజధాని గ్యాంగ్ టక్ కు 33 కిలోమీటర్ల దూరంలో పాక్యాంగ్‌ లో ఈ విమానాశ్రయం నిర్మించారు. భారత్‌-చైనా సరిహద్దుకు కేవలం 60కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ పోర్ట్ ఉంది. వాతావరణ ప్రతికూలతల మధ్య తొమ్మిదేళ్లు శ్రమించి పర్వత శిఖరాలను తొలిచి రూ.605కోట్లతో ఈ ఎయిర్ పోర్ట్ ని నిర్మించారు

Posted in Uncategorized

Latest Updates