ఫోన్ నెంబర్ల ట్యాపింగ్ జరుగుతోంది : రాజ్ నాథ్ కు కన్నా లేఖ

ఏపీ ప్రభుత్వం తన ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈ రోజు ఉదయం రాజ్ నాథ్ తో సమావేశమైన కన్నా… స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్  తన ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేస్తుందని తెలిపారు. కొన్ని రోజులుగా తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ కన్నా బహిరంగంగానే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో… ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ కన్నా లేఖ రాయడంపై ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల అనంతపురం పర్యటన సందర్భంగా తనను చంపేందుకు కొందరు టీడీపీ వ్యక్తులు ప్రయత్నించారని కన్నా తెలిపారు. ఆ తరువాత కావలిలో రోడ్డు షో చేస్తున్న సమయంలో… టీడీపీ నాయకులే తమ కార్యకర్త చేత తనపై చెప్పు వేయించారని కన్నా ఆరోపించారు. ఒంగోలులో కూడా పధకం మార్చి తనపై దాడికి పాల్పడ్డారని, దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని కన్నా తెలిపారు.ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్తున్నాననే తనపై భౌతికదాడులు జరుగుతున్నాయని కన్నా తెలిపారు. దీనిపై విచారణ జరిపించి… తగిన చర్యలు తీసుకుంటామని రాజ్ నాథ్ హామీ ఇచ్చారని కన్నా తెలిపారు.
విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates