ఫోన్ పై గీతలు పడితే..

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లేదా ప్రీమియం ఫోన్ అయినా.. ప్రతి ఒక్కరు దాదాపుగా ఫోన్లను చేతిలోనే ఉంచుకుంటా రు. అయితే, అనుకోకుం డా ఫోన్ చేతిలో నుంచి కిం ద పడితే.. స్క్రీన్‌ ‌కు నష్టం జరుగుతుంది. కింద పడటం వల్లే కాకుండా.. ఇతర కారణాల వల్ల ఫోన్‌ ‌ స్క్రీన్‌ ‌ పగిలిపోతుంది. స్క్రీన్‌ ‌ రీప్లేస్‌ మెంట్‌ కోసం ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. కొన్ని ఈజీ టిప్స్‌తో క్రాక్స్‌ సరిచేసుకోవచ్చు. ఫోన్‌ ‌పై పడే గీతలను తొలగించడానికి బేకింగ్ సోడా చక్కని పరిష్కారం. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక టేబుల్ స్పూన్ నీటిలో పేస్టులా కలుపుకోవాలి. దీనిని ఒక పొడి క్లాత్‌ ఉంచి.. నెమ్మదిగా ఫోన్‌ ‌ గీతలపై రుద్దడం వల్ల గీతలు కనిపించవు. పైగా స్క్రీన్‌ ‌ కాంతివంతంగా కనిపిస్తుంది.  కొంచెం టూత్ పేస్టు వేలుపై తీసుకోవాలి. తరువాత సెమీ సర్కిల్ ఆకారంలో ఫోన్ స్క్రీన్ పైన నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే స్క్రీన్‌ గార్డ్‌ మెరుస్తుంది. ట్రాన్స్‌ ఫరెంట్ నెయిల్ పాలిష్‌ లో బ్రష్‌ ముంచి .. ఫోన్‌ ‌ గీతలపై రుద్దాలి. అది పొడిగా అయ్యే వరకు ఆగి.. తరువాత పొడి క్లాత్‌ పై కొద్దిగా వెజిటెబుల్ ఆయిల్ తీసుకొని స్క్రీన్‌ ‌పై తుడవాలి. తర్వాత స్క్రీన్‌ను మృదువైన క్లాత్‌ తో శుభ్రం చేస్తే సరిపోతుంది.

Posted in Uncategorized

Latest Updates