ఫోర్బ్స్‌ లిస్టులో నీతా అంబానీ, మిథాలీ

NEETAప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ స్పోర్ట్స్ కేటగిరీలో అత్యంత శక్తివంతమైన ఉమెన్స్ లిస్టును ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన నీతా అంబానీ, మిథాలీ రాజ్‌ స్థానం దక్కించుకున్నారు. టాప్‌-10లో నీతా అంబానీ స్థానం దక్కించుకున్నారు.

25మంది పేర్లతో ఫోర్బ్స్‌-2018కి సంబంధించి విడుదల చేసిన లిస్టులో ఫిఫా సెక్రటరీ ఫట్మా సంబ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో ఫుట్‌బాల్ ఆటకు చెందిన వారే ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ 9వ స్థానంలో నిలవగా… భారత ఉమెన్స్ క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ 12వ స్థానంలో నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates