ఫోర్బ్స్‌ లిస్టులో… 12 భారత కంపెనీలు


ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల్లో భారత్‌కు చెందిన 12 కంపెనీలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని ఫోర్బ్స్‌ విడుదల చేసిన లిస్టులో తెలిపింది. జాబితాలో అమెరికాకు చెందిన ఎంటర్‌టెయిన్‌మెంట్‌ దిగ్గజం వాల్ట్‌ డిస్నీ నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. దీని మార్కెట్‌ క్యాప్‌ 16,500 కోట్ల డాలర్లు. తర్వాతి స్థానం ఆతిథ్యరంగానికి చెందిన దిగ్గజం హిల్టన్‌, మూడవ స్థానం ఇటాలియన్‌ కార్ల తయారీ కంపెనీ ఫెరారీ దక్కించుకుంది.

ఈ ఏడాది టాప్‌ 10 కంపెనీల్లో ఫైనాన్షియల్‌ సర్వీ సెస్‌ కంపెనీ వీసా 4వ స్థానం, డిజిల్‌ పేమెంట్‌ కం పెనీ పేపాల్‌ (5) స్థానం, మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌ (6) స్థానం, సీమెన్స్‌ (7) స్థానం, ఇంటర్నెట్‌ రిటైలర్‌ అమెజాన్‌ డాట్‌కామ్‌ (8), మారియట్‌ ఇంటర్నేషనల్‌ (9) మాస్టర్‌కార్డ్‌ (10)వ స్థానంలో నిలిచాయి.

ఇక భారత్‌ కంపెనీల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం HDFC లిస్టులో 217వ స్థానం దక్కించుకుంది. భారత్‌కు చెందిన బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగం నుంచి ఇదొక్క కంపెనీ చోటు దక్కించుకుంది. ఇన్ఫోసిస్‌ (31)వ స్థానం, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (35), టాటామోటార్స్‌ (70) టాటాస్టీల్‌ (131) లార్సన్‌ అండ్‌ టర్బో (135) గ్రాసిం ఇండస్ట్రీస్‌ (154) జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (156) మహీం ద్రా అండ్‌ మహీంద్రా (164), ఏషియన్‌ పెయింట్స్‌ (203) స్టీల్‌ అధారిటి ఆఫ్‌ ఇండియా (227) ఐటీసీ (239)గా నిలిచాయి.

ఫోర్బ్బ్‌ జాబితాలో 250 కంపెనీలకు గాను అమెరికాకు చెందిన 61 కంపెనీలు స్థానం దక్కించు కోగా జపాన్‌కు చెందినవి 32 కంపెనీలు ఉన్నాయి. వీడియోగేమ్స్‌ తయారీ కంపెనీ నిన్‌టెండో జపాన్‌కు చెందిన కంపెనీ 11వ స్థానం దక్కించుకోగా.. టయోటా 12వ స్థానంలో నిలిచింది. చైనాకు చెందినవి 19 కంపెనీలు, ఫ్రాన్స్‌ 13, ఇండియా 12 జర్మీనికి చెందినవి 11 కంపెనీలు చోటు స్థానం దక్కించుకున్నాయి.

 

 

 

Posted in Uncategorized

Latest Updates