ఫోర్బ్స్ లో సత్తాచాటిన అనుష్క, సింధు

ANUSHKA SINDHU FORBESబాలీవుడ్ హీరోయిన్ అనుష్కకు, బ్యాడ్మింటన్ పీవీ సింధులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ట్యాలెంట్ ఉన్న 30 సంవత్సరాల వయసులోపు వారిని గుర్తించి అవార్డులిచ్చే ఫోర్బ్స్ ..ఈ సంవత్సరం లిస్టును రిలీజ్ చేసింది. ఆసియాలో 30 సంవత్సరాల వయసులోపున్న వివిధ రంగాల్లో సత్తా చాటిన 300 మంది ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్ల లిస్టును మంగళవారం (మార్చి-27) న ప్రకటించింది ఫోర్బ్స్‌. ఆసియా 30 అండర్‌ 30 -2018 పేరుతో ప్రకటించిన ఈ జాబితాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధులకు చోటుదక్కింది. వినోద, వాణిజ్య, వెంచర్‌ క్యాపిటల్‌, రిటైల్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు వంటి పలు రంగాల నుంచి పలువురిని ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది.

ఇంకా ఈ లిస్టులో మనదేశం నుంచి మోడల్‌ భూమికా అరోరా, సైనప్‌ సీఈఓ అశ్విన్‌ రమేష్‌, అథ్లెట్‌ శ్రుతి మంథన, హేడేకేర్‌ ఫౌండర్‌ దీపాంజలి దాల్మియా, హెల్త్‌సెట్‌గో ఫౌండర్‌ ప్రియా ప్రకాష్‌ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నోక్రాట్లున్నారు.

Posted in Uncategorized

Latest Updates