ఫోర్లు, సిక్సుల మోత : కోల్ కతా ఘనవిజయం

kkrకోల్ కతా అదరగొట్టింది.  రాజస్థాన్ రాయల్స్ ను ఓడిచింది. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ లలో  రహానే తప్ప ఎవరూ దూకుడుగా ఆడలేదు. షార్ట్  44 పరుగులు చేసినా చాలా నెమ్మదిగా ఆడాడు. కోల్ కతా స్పిన్నర్లు పీయూష్  చావ్లా,  కుల్ దీప్ , నితీష్  రాణా.. రాజస్థాన్ ను కట్టడి చేశారు. దాంతో  8వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేయగలిగింది రాజస్థాన్.  161రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా ఈజీగా విజయాన్ని అందుకుంది. 18.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసి విక్టరీ సాధించింది. తొలి పరుగు దగ్గరే ఓపెనర్  లిన్  ఔటైనా.. కోల్ కతా ఇన్నింగ్స్ పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. నరైన్  25 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సుతో ధనాధన్  ఇన్నింగ్స్  ఆడాడు. రాబిన్  ఉతప్ప 48 రన్స్.. దినేశ్  కార్తీక్    42 రన్స్ చేసి నాటౌట్  గా నిలిచాడు. నరైన్  25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 35 రన్స్ చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న  నితీశ్  రాణా 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 35 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. దాంతో నైట్ రైడర్స్ విజయం ఈజీ అయింది.

Posted in Uncategorized

Latest Updates