ఫ్యాబ్‌ ఇండియాపై.. ఖాదీ కమిషన్ కేసు

fabఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(KVIC) ఫ్యాబ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. అక్రమంగా చెరఖా ట్రేడ్ మార్క్ ను ఉపయోగించుకుంటూ…బట్టలను ఖాదీ ట్యాగ్ లో అమ్ముతున్నారని ఆరోపించింది. దీనికి నష్ట పరిహారంగా…రూ.525 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. తమకు క్షమాపణలు చెప్పడంతో పాటు… చరఖా ప్రదర్శించడాన్ని ఆపేయాలని నోటీసుల్లో స్పష్టంచేసింది. ఖాదీ ట్రేడ్‌మార్క్‌తో ఏవీ అమ్మకూడదని డిమాండ్‌ చేసింది.

మరోవైపు KVIC.. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తోందంటూ ఫ్యాబ్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates