ఫ్యామిలీ అంతా ఒకేచోట..అందరి ముఖాలు మొబైల్స్ లోనే : బిగ్ బీ

అన్నంలేకపోయిన ఫర్వాలేదు కానీ..చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారుతోంది ప్రస్తుత జనరేషన్ అనే సంగతి తెలిసిందే. ఏ ఫంక్షన్ కి వెళ్లినా..చేతిలో మొబైల్ చూస్తూ టైమ్ పాస్ చేయడమే తప్పా..బంధువులతో ఆత్మీయంగా పలకరించే రోజులు కనుమరుగవుతున్నాయి. ఇదే విషయంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పెరుగుతున్న టెక్నాలజీ కార‌ణంగా మ‌నుషుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు త‌గ్గుతున్నాయ‌నే విష‌యాన్ని ప్రాక్టిక‌ల్‌ గా చూపించారు అమితాబ్‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే అమితాబ్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో త‌న కొడుకు అభిషేక్ బ‌చ్చ‌న్‌, చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, మనవళ్లు నవ్యా నవెలి నందా, అగస్త్య తదితరులు క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. అందులో న‌వ్య త‌ప్ప మిగ‌తా అంద‌రి ముఖాలు మొబైల్‌ లోనే ఉన్నాయి. ఈ స‌న్నివేశాన్ని క్లిక్ మ‌నిపించిన బిగ్ బీ, ఆ ఫోటో పోస్ట్ చేస్తూ .. ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉన్నారు కాని.. వారితో ఫోన్స్ కూడా ఉన్నాయి అనే కామెంట్ పెట్టారు. ప్ర‌స్తుతం బిగ్ బీ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, నెటిజన్స్ పలు ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో పోస్ట్ చేసి 24 గంట‌లు కూడా కాక‌ముందే ఐదున్నర లక్షలకు పైగా లైక్స్ సంపాదించుకుంది.

Posted in Uncategorized

Latest Updates