ఫ్యామిలీ సెలబ్రేషన్స్ : ఎన్టీఆర్ చిన్నకొడుకు పేరు ఇదే

NTR familyజూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్.. తన చిన్న కొడుకుని ఒళ్లో కూర్చొపెట్టుకుని ముద్దాడుతుంటే.. పెద్ద కొడుకు అభయ్ రామ్ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి.. తమ్ముడిని చూస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ పక్కనే భార్య లక్ష్మీప్రణతి పిల్లలను చూస్తూ ఉంటుంది.

చిన్న కొడుకుకి భార్గవ్ రామ్ అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ ఫోటోని చూసిన ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. భార్గవ్ రామ్ పేరు అద్భుతంగా ఉందంటూ.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లు బాగున్నాయంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. నాన్నకు ప్రేమతో అంటూ ఆ ఫోటో కింద అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరో వారసుడు రాకతో నందమూరి ఫ్యామిలీ ఖుషీగా ఉంది. భార్గవ్ రామ్ పేరు కూడా బాగుందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates