ఫ్యాషనా మజాకా.. సిమెంట్‌ బస్తాలతో పెళ్లిగౌను

ఫ్యాషన్..ప్రస్తుతం ట్రెండ్ కి మారు పేరు. ఏం చేసినా అందరినీ ఆకట్టుకునేలా యూత్ రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇందుకు భారీ ఖర్చుతో కూడుకున్న పని అనుకునే వాళ్లకి ఈ ఫోటో నిదర్శనంగా నిలుస్తోంది. ఫ్యాషన్ కు డబ్బుతో పనిలేదని నిరూపించింది. జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది.

తమ వెడ్డింగ్‌ డ్రెస్‌ పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. మరి పేదోడు ఫ్యాషన్‌ డిజైనర్‌ ను భరించగలడా.. కాస్త మెదడుకు పని పెడితే మనలోనూ ఫ్యాషన్‌ డిజైనర్‌ పుడతాడు. చైనాలోని ఓ మహిళా రైతే దీనికి నిదర్శనం. పేరు లిలీతాన్‌. గంగ్సూ ప్రావిన్స్‌లో ఓ కుగ్రామంలో నివాసం. రోజూ పొలం పనుల్లో బిజీగా ఉంటుంది. ఓ రోజు వర్షం పడుతుండటంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తోచలేదామెకు.

ఒకప్పుడు ఓ మేగజీన్‌లో చూసిన అందమైన వెడ్డింగ్‌ గౌన్‌ గుర్తొచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని.. 3 గంటల్లో అచ్చం అలాంటి వెడ్డింగ్‌ డ్రెస్‌ నే కుట్టేసింది. సిమెంట్‌ బస్తాల గౌన్‌ తో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేయడంతో.. లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్‌ లైన్‌లో ఈ ఫొటో హల్‌చల్‌ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది.

 

Posted in Uncategorized

Latest Updates