ఫ్రెంచ్ ఓపెన్ నాదల్ దే : డొమినిక్ థీమ్ పై గ్రాండ్ విక్టరీ

nadelక్లే కోర్టుకు తనే రారాజునని మరోసారి నిరూపించాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. ఆస్ట్రియా సంచలనం డొమినిక్ థీమ్ ను వరుస సెట్లలో ఓడించి…రికార్డు స్థాయిలో 11వ సారి రోలండ్ గారోస్ టైటిల్ గెలిచాడు. సంచలనాలేమీ లేకుండా… అచ్చొచ్చిన క్లే కోర్టులో రఫ్ఫాడించాడు నాదల్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో థీమ్ ను 6-4, 6-3, 6-2 తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో ఒకే గ్రాండ్ స్లామ్ ని అత్యధిక సార్లు గెలిచిన ప్లేయర్ గా మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేశాడు. మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ను 11 సార్లు గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో నాదల్ గ్రాండ్స్ శ్లామ్స్ సంఖ్య 17 కు చేరింది.

Posted in Uncategorized

Latest Updates