ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం : ebay.in మూసివేత

ఈబే డాట్ ఇన్ మూసివేస్తున్నారు. ఆగస్ట్ 14వ తేదీతో దీనికి ఎండ్ కార్డ్ పడుతుంది. ఏడాది క్రితం ఈబేను కొనుగోలు చేసింది ఫ్లిప్ కార్ట్. ఇప్పుడు ఆ బ్రాండ్ ను మూసేసి.. కొత్తగా ఫ్లాట్ ఫాంపై అమ్మకాలు సాగించాలని నిర్ణయించింది. ఫ్లిప్ కార్ట్ బ్రాండ్ పైనే.. కొత్త పేరుతో ఈబే అమ్మకాలను సాగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు లేఖ రాశారు సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి. ఈబే వల్ల ఎంతో విలువైన సమచారం, వినియోగదారుల అభిరుచులను తెలుసుకున్నాం. రాబోయే కాలంలో refurbished ఐటమ్స్ – సెకండ్ హ్యాండ్ కు మరింత డిమాండ్ ఉంటుందని.. అందుకు అనుగుణంగా ఫ్లిప్ కార్ట్ బ్రాండ్ పై.. కొత్త ఫ్లాట్ ఫాంపై రాబోతున్నట్లు ప్రకటించారు.

దీనిపై ఈబే స్పందించింది. ఫ్లిప్ కార్ట్ లో పూర్తిస్థాయి ఒప్పందాలు ముగిసిన తర్వాత.. ఈబే బ్రాండ్ లైసెన్స్ రద్దు చేయటం కూడా ఓ భాగం అని స్పష్టం చేసింది. ప్రస్తుతం అన్ని వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి లావాదేవీలు ముగిశాయని.. ఈబే ఉంచటం, మూసివేయటం అనేది పూర్తిగా ఫ్లిప్ కార్ట్ పరిధిలోని అంశం అని స్పష్టం చేసింది. సో.. ఆగస్ట్ 14వ తేదీతో ఈబే డాట్ ఇన్ శాశ్వతంగా క్లోజ్ కాబోతున్నది.

Posted in Uncategorized

Latest Updates