ఫ్లైఓవర్లతోనే ట్రాఫిక్ కు చెక్ : కేటీఆర్

ఫ్లై ఓవర్లతో సిటీలో ట్రాఫిక్ కు చెక్ పెట్టొచ్చన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం (జూలై-20) హైదరాబాద్ లోని కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌ కు శంకుస్థాపన చేశారు కేటీఆర్. ఈ సందర్బంగా మట్లాడిన ఆయన..సిటీలో ట్రాపిక్ సమస్య నుంచి వాహనదారులకు విముక్తి కల్గించేందుకే ప్లైఓవర్లను నిర్మిస్తున్నామన్నారు.  ఈ ఫ్లై ఓవర్‌ ను రూ. 263 కోట్లతో నిర్మించనున్నారు.

గచ్చిబౌలి నుంచి హాఫిజ్‌ పేట్ మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే రూట్.. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ రోడ్లను కలుపుతూ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగనుంది. ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

 

Posted in Uncategorized

Latest Updates