ఫ్లైట్ లో శ్వాస ఆడక చిన్నారి మృతి

హైదరాబాద్ : విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన హైదరాబాద్, శంషాబాద్ లో జరిగింది. అమెరికా నుంచి దోహో వెళ్తున్న విమానంలో 11 నెలల చిన్నారి ఆర్నావ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఆర్నావ్‌ వర్మను అపోలోకు తరలించారు ఎయిర్‌ పోర్టు పోలీసులు.

అయితే ..శ్వాస ఆడక చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు.  సొంతూరులో తమ బంధువులను కలవబోతున్నామని.. ఎంతో ఆశతో స్వదేశంలో అడుగుపెట్టగానే..తమ బిడ్డ చనిపోయిందని బోరున విలపించారు చిన్నారి తల్లిదండ్రులు. దంపతులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. హైదరాబాద్, మౌలాలీకి చెందిన దంపతులు.. అమెరికా నుంచి దోహా మీదుగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. విమానంలోనే 11నెలల అర్నావ్ అస్వస్థతకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుందన్నారు.

ఊపిరాడక తెగ ఇబ్బంది పడింది

అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో  శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడినట్లు తెలిపారు ప్రయాణికులు. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి  విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదన్నారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారన్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates