ఫ్లోరిడాలో మారణహోమం : 17 మంది విద్యార్థులు మృతి

Attack-in-Floridaఅమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడాలోని హై స్కూల్లో కాల్పులతో 17 మంది విద్యార్థులు చనిపోయారు. కాల్పులు జరిపిన యువకుడికి 19 ఏళ్లుంటాయని పోలీసులు చెబుతున్నారు. అతను అదే స్కూల్ కు చెందిన పాత విద్యార్థిగా చెబుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేశారు.

పార్క్ లాండ్ లోని మర్జోరి స్టోన్ మ్యాన్ డగ్లాస్ హై స్కూల్లో కొద్ది సేపటి క్రితం కాల్పులు జరిగాయి. బుల్లెట్లు కాల్చిన సౌండ్ వినిపించగానే.. స్కూల్లో టీచర్లు, విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది క్లాస్ లోనే ర్యాక్ లు, డెస్కుల కింద దాక్కున్నారు. కాల్పులు జరిపిన స్టూడెంట్ ను నికోలస్ క్రూజ్ గా గుర్తించారు. అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో.. స్కూల్ నుంచి కొన్ని రోజుల క్రితం వెళ్లగొట్టారు. దీంతో… AR-15 రైఫిల్ తో అతను కాల్పులు జరిపాడు. దీంతో 17 మంది చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates