బంకు మోసాలు : పెట్రోల్ కు బదులు నీళ్లు

petrol waterరోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతుండగా..ఇప్పడు పెట్రోల్ ల్లోనే కల్తీ చేస్తూ, మరింతగా దండుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, సుజాతనగర్ లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు  వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. ఈ పెట్రోల్ బంక్ ద్వారా హిందుస్థాన్ పెట్రోలియం ఉత్పత్తిని విక్రయిస్తుంటారు. సుజాతనగర్ లో ఓ వ్యక్తి బాటిల్ లో పెట్రోల్ తీసుకువెళ్లేందుకు బంక్ కు వచ్చాడు.

పెట్రోల్ పోయించుకొనే క్రమంలో బాటిల్ లోకి పెట్రోల్ కు బదులు నీళ్లు రావడంతో షాక్ కు గురయ్యాడు. దీంతో వాహనదారులు కలిసి ఆందోళనకు దిగారు. మరోసారి ఖాళీ బకెట్ లోకి కొట్టినా గాని నీరే రావడంతో ఆందోళన ఉధృతం చేశారు. ఈ మేరకు సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందించారు. బంక్ వద్దకు చేరుకున్న సుజాతనగర్ పోలీసులు..  శాంపిల్ తీసుకొని పరీక్షలకు పంపిస్తామని సంబంధిత అధికారులు లోపం ఉంటే చర్యలు తీసుకుంటారని చెప్పారు. పెట్రోల్ బంకుల మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, క్వాలిటీలేని పెట్రోల్ తో వెహికిల్స్ పాడైపోతున్నాయంటున్నారు వాహనదారులు.

Posted in Uncategorized

Latest Updates