బంగారం,వెండి ధరలు తగ్గాయి

goldకొద్దిరోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర తగ్గుముఖం పట్టింది. సోమవారం(మే-28) గోల్డ్ రేట్ భారీ తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.405 తగ్గి రూ.32వేల దిగువకు పడిపోయింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి రూ.370 తగ్గడం ద్వారా రూ.41వేల మార్కును కోల్పోయి… రూ.40,830 పలుకుతోంది. అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో బంగారం కొనుగోలుకు పెట్టుబడిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. అంతర్జాతీయంగా 0.30శాతం తగ్గిన బంగారం ధర ఔన్సు 1,296.20 డాలర్లుగా ఉంది. వెండి కూడా 0.36శాతం తగ్గి ఔన్సు 16.51డాలర్లకు చేరింది.

 

Posted in Uncategorized

Latest Updates