బంగారు తెలంగాణే కేసీఆర్ లక్ష్యం : మహేందర్ రెడ్డి

MAHENDERతెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.  వికారాబాద్ పోలీసు గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ఎగరేశారు. ఎస్పీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు వేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణలో పేదరికాన్ని తరిమేస్తామన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛను, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, విద్యార్థులకు సన్నబియ్యం లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి.

 

Posted in Uncategorized

Latest Updates